రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పెండ్లి రోజు సందర్భంగా మంగళవారం గొల్లపల్లి గ్రామంలోని జిల్లా కిసాన్ సెల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ శాఖ అధ్యక్షులు గుడ్ల శ్రీను, పందిర్ల సుధాకర్ గౌడ్, గోగూరి శ్రీనివాస్ రెడ్డి, నర్రా భగవంతు రెడ్డి, సత్యా రెడ్డి, ముచ్చరాజిరెడ్డి, దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతున్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు.