మాండస్ తుఫాన్‌తో తీవ్రంగా నష్టపోయిన పొగాకు రైతులను ఆదుకోవాలని జిల్లాకు చెందిన వివిధ రైతుసంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. గుంటూరులోని పొగాకు బోర్డు కేంద్ర కార్యాలయానికి మంగళ వారం జిల్లాకు చెందిన రైతు ప్రతినిధులు వెళ్లి ఈడీ అద్దంకి శ్రీధర్‌బాబును కలిశారు. జిల్లాలో 1.01 లక్షల ఎకరాల్లో పొగాకు పంట సాగు చేయగా 45,321 ఎకరాల్లో తీవ్రంగా రైతులు నష్టపోయారని తెలిపారు. ఈ నేపథ్యంలో రుణాలను రీషెడ్యూల్ చేసి మళ్లీ రుణాలు ఇవ్వాలని కోరారు. అలాగే బాగా దెబ్బతిన్న తోటలకు ఎకరాకు రూ.25వేలు, ఒక మోస్తరు దెబ్బతిన్న వాటికి ఎకరాకు రూ.10వేల వంతున బోర్డు నిధి నుంచి పరిహారం ఇవ్వడంతోపాటు బ్యారన్‌కు రూ.లక్ష వడ్డీలేని రుణం అందజేయాలని కోరారు. ఈడీని కలిసిన వారిలో బోర్డు మాజీ సభ్యుడు చుండూరి రంగారావు, రైతుసంఘాల ప్రతినిధులు పమి డి.వెంకట్రావు, హనుమారెడ్డి, లలితకుమారి, జె.జయంతిబాబు, వి.బాలకోటయ్య, అబ్బూరి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
పొగాకు రైతులకు రూ.10వేల వడ్డీలేని రుణం
తుఫాన్ కారణంగా నష్టపోయిన పొగాకు రైతులకు తక్షణ ఉపశమనంగా ఒక్కొక్కరికి రూ.10వేలు వడ్డీ లేని రుణం ఇస్తా మని బోర్డు ఈడీ అద్దంకి శ్రీధర్‌బాబు ఒక ప్రకటనలో తెలి పారు. రైతుసంక్షేమ నిధి నుంచి ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు కేం ద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అనుమతించినట్లు పేర్కొన్నారు.