రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఈనెల రెండో తేదీన జరిగిన సిర్రం మహేష్ హత్య కేసులో నిందితుడైన దర్ర తిరుపతి నీ ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపారు పోలీసులు. వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారీ తెలిపిన వివరాల ప్రకారం ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన సిర్ర మహేష్ కి 12 సంవత్సరాలు క్రితం పద్మతో వివాహం జరగగా వీరికి ఇద్దరు కూతుర్లు కలిగారు. మూడు సంవత్సరాల క్రితం భార్యాభర్తల మధ్య గొడవలతో భార్యతో విడిపోయి సిర్రం మహేష్ ఒంటరిగా ఉంటు సంవత్సరంన్నర నుండి వేములవాడలో బిల్డింగ్ మేస్త్రిల దగ్గర కూలీ గా పని చేస్తూ జీవిస్తున్నాడు. ఆరు నెలల నుండి భగవంతరావు నగర్ చెందిన బుట్టి శ్రీనివాస్ యొక్క రేకుల రూమ్ లో కిరాయికి ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నాడు. బిల్డింగ్ మేస్త్రీల దగ్గర కూలీగా పని చేసే భగవంతు రావు నగర్ కి చెందిన ధర్ర తిరుపతికి సిర్రం మహేష్ తో స్నేహం ఏర్పడింది. గత నాలుగు నెలల నుండి సిర్రమ్ మహేష్ యొక్క రూమ్ లో దర్ర తిరుపతి కూడా ఉంటున్నాడు. తిరుపతికి పెళ్లయి గొడవలతో భార్య చాలా రోజుల క్రితం వదిలిపెట్టి వెళ్ళిపోయివడంతో తిరుపతి కూడా ఒంటరి జీవితం గడుపుతున్నాడు.
శిర్రం మహేష్ రూమ్ లో వుంటున్నందుకు కిరాయి డబ్బులు తిరుపతి ఇవ్వడం లేదు. కిరాయి లేకుండా ఫ్రీగా ఉంటున్నాడని సీర్రం మహేష్ దర్రా తిరుపతిని రోజు సూటి పోటి మాటలతో వేధిస్తున్నాడు. రూమ్ ఊడవమని, వంట చెయ్యమని, తాగుడు ఎక్కువ అవుతుందని, పని చేస్తలేవ్ ఎందుకని, నిన్ను రూమ్ లో ఉండనీయకుంటే నువ్వు ఫుట్ పాత్ మీద బతకాల్సి వస్తుందని రోజు మానసికంగా వేదించడంతో అతని వేదింపులు బుట్టి శ్రీనివాస్ కి చెప్పుకుంటూ దర్ర తిరుపతి బాధపడుతుండే వాడు. మహేష్ తిరుపతిని అపుడపుడు మిగతా కూలీల ముందు చులకనగా మాట్లాడేవాడు. ఈ విషయం మనసులో పెట్టుకొని తిరుపతి మహేష్ ని ఎలాగైనా చంపాలని ఉద్దేశంతో తేదీ 01.04. 2024 రోజున రాత్రి మహేష్ రూమ్ కి వెళ్ళి మృతునికి బాగా మద్యం త్రాగించి మృతుడు మద్యం మత్తులో ఉండగా నిందితుడు పెద్ద సిమెంట్ బండరాయి తీసుకువచ్చి మృతుని ముఖంపై పలుమార్లు కొట్టి చంపి అక్కడి నుండి పారిపోయ్యాడు. ఈరోజు నమ్మదగిన సమాచారం మేరకు నిందితున్ని చెక్కపల్లి రోడ్డు లో సబ్స్టేషన్ దగ్గర వేములవాడ ఇంచార్జ్ సిఐ శ్రీనివాస్ తన సిబ్బందితో వాహన తనిఖీలు చేస్తుండగా పట్టుకుని క్రైం సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసి అక్కడ పొదల్లో దాచిన రక్తపు మరకలు గల నిందితుని బట్టలు, హత్యకు ఉపయోగించిన సిమెంట్ బండరాయిని స్వాధీనం చేసుకొని నిందితున్ని రిమాండ్ కు తరలించినామని వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారీ తెలిపారు. కార్యక్రమంలో ఇంచార్జి సిఐ శ్రీనివాస్, SI అంజయ్య పాల్గొన్నారు.