ఎల్లారెడ్డి పేట కు చెందిన ఏర్పుల పద్మ – బాలయ్య ల కనిష్ట పుత్రిక. ప్రవణ్య వివాహం వీర్ణపల్లి మండలంలోని గర్జనపల్లి కి చెందిన దోమకొండ మల్లయ్య – లక్ష్మి ల ప్రథమ కుమారుడు అభిషేక్ తో జరుగగా వీరి వివాహానికి ఎల్లారెడ్డి పేట తాజా మాజీ సర్పంచ్ నేవూరి మమత వెంకట్ రెడ్డి వారి తల్లిదండ్రులు కీర్తి శేషులు లక్ష్మి మల్లారెడ్డి ల జ్ఞ్యాపకార్డం. పుస్తే మెట్టెలు అందజేశారు. అంతేకాకుండా వివాహా భోజనం కోసం 50 కిలోల బియ్యం కూడా అమ్మాయి కుటుంభానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం మండల మాజీ అధ్యక్షుడు గన్న మల్లారెడ్డి, రైతు చర్చ మండలి అద్యక్షుడు సందుపట్ల రాజిరెడ్డి, బి ఆర్ ఎస్ నాయకులు ఎనగందుల బాబు, తాజా మాజీ వార్డు సభ్యులు పందీర్ల శ్రీనివాస్, ద్యాగం లక్ష్మి నారాయణ, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్, గంట వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.*