ప్రమాదం జరుగుతే తప్ప విద్యుత్తు లైను సరి చెయ్యరా..? అని నరసింహ పల్లె గ్రామ నివాసి చెక్కపల్లి (బట్టు ) వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. తంగళ్లపెల్లి మండలం నర్సింహులపల్లి గ్రామానికి చెందిన చెక్కపల్లి (బట్టు ) వెంకట్ రెడ్డి తన వ్యవసాయ పొలం మీది కూడా ఉన్న విద్యుత్ లైన్ ఓ మనిషికి చేతికి తాగే విధంగా కిందికి లూజ్ అయింది. ఈ పీడర్ రామచంద్రపూర్ సబ్ స్టేషన్ నుండి పనిచేస్తుంది. వెంకట్ రెడ్డి పొలం మీదుగా ఉన్న విద్యుత్తు స్తంభాలకు 17000/- ఫీజు కట్టామని తెలిపారు. ఫీజు కట్టినా కూడా రెండు సంవత్సరాలుగా సర్వీస్ లైన్ వాడుకున్నామని వాపోయారు. అదనంగా స్తంభాల గుంతల కొరకు కాంట్రాక్టర్ 9000/- రూపాయలు వసూలు చేశారని పేర్కొన్నారు. ఎన్నోసార్లు సెస్ అధికారులకు ఫిర్యాదు చేసిన నిర్లక్ష్యంగా వహిస్తున్నారని మండిపడ్డారు. గత రోజు ఈదురు గాలులతో వర్షం కురువరంతో నరసింహుల పల్లె గ్రామనికి చెందిన సాకలి కనకయ్య పొలం వద్ద కరెంటు వైర్లు నేలపై పడిపోవడంతో పడేకు గుడిసెల చంద్రయ్య అనే గొర్ల కాపరి మేక పిల్ల మృతి చెందింది. మేక పిల్ల ఖరీదు దాదాపు 20 వేల రూపాయలు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. సెస్ అధికారులు స్పందించి ఇలా ప్రమాదాలు జరగకముందే విద్యుత్తులైన్ లను సరిచేసి మరమ్మతులు చేయాలని ఆ రైతులు అధికారులను కోరుతున్నారు. తంగళ్ళపల్లి ఏఈ వివరణ కోరగా ఈ విషయంపై వివరణ కోరగా రైతులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ లైన్లు ఎక్కడెక్కడ ప్రమాదం సంభవించే విధంగా ఉన్నాయో వాటిని వెంటనే సరి చేపిస్తానని తెలిపారు .