గుడివాడ రాజకీయాలు ఎప్పుడు ఒక కొత్త ఒరవడి సంతరించుకుంటూ ఉంటాయి. గుడివాడలో రాజకీయం చెయ్యాలంటే చాలా నేర్పు కావాలి, ప్రత్యర్థుల ఎత్తుకు పైఎత్తు వెయ్యగలగాలి, అప్పుడే విజయం వరిస్తుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో కొడాలి నాని వేసిన అంచనాలు తారుమారయ్యి కొడాలి నాని ఆడే పాచీపోయిన రాజకీయ ఆట గుడివాడ ప్రజలకి చిరాకు పుట్టించిదని అందుకే కొడాలి నాని ఘోర పరాజయం పాలయ్యాడని మళ్ళీ కొడాలి నానికి గుడివాడ సీటు ఇస్తే డిపాజిట్లు కూడా రావని తెలియడంతో ఇక కొడాలి నాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని వైసిపి అధిష్ఠానం కొత్త నాయకుల కోసం వెతుకులాట మొదలు పెట్టినట్టు ఉందని సొంత గూటి వాళ్ళే గుసగుసలు మెదలు పెట్టారు. అందుకనే గతంలో ఎప్పుడూ లేని విధంగా బలమైన బీసీ నాయకుడు కఠారి ఈశ్వర్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున వైసిపి నాయకులు, బీసీ నాయకులు, వైసిపి ముఖ్యనేతలు కఠారి ఈశ్వర్ కుమార్ కి శుభాకాంక్షలు తెలపటానికి పెద్ద సంఖ్యలో క్యూ కట్టారనే గుడివాడ కోడై కూస్తుంది.
కఠారి ఈశ్వర్ కుమార్ మాజీ మంత్రి బలమైన బీసీ నాయకుడు కావటం వైసిపికి బలం చేకూర్చే విధంగా వుంటుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట..! ఇక పోతే కొడాలి నాని గుడివాడ నుంచి పక్క రాష్ట్రానికి మకాం మార్చేసాడని, తనకు సంబంధించిన వ్యాపార లావాదేవీలలో ఆస్తి పంపకాలు జరేగిపోయాయని, అందుకే శరత్ థియేటర్ వదిలేశాడని సొంత వైసిపి పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. భవిష్యత్తు రాజకీయాలపై చర్చించటానికి వచ్చిన మచిలీపట్నం వైసిపి నాయకుడు పేర్ని నాని కి కూడా రాజకీయాలకు దూరంగా వుండబోతునట్టుగా కొడాలి నాని చెప్పినట్లు వినికిడి..!కొడాలి నాని కూడా కఠారి ఈశ్వర్ కుమార్ ని ఇంటికి పిలిపించుకుని తాను రాజకీయ సన్యాసం తీసుకునే ఆలోచనలో వున్నానని, వైసిపి పార్టీ నాయకులను కార్యకర్తలను కలుపుకుని ముందుకు సాగాలని, గుడివాడ వైసిపి పార్టీ కి అండగా నిలబడాలని, వైసిపి కార్యకర్తలకు ప్రత్యర్థి పార్టీ నాయకులు ఏలాంటి సమస్యలు కలిగించినా, ఇబ్బందులకు గురిచేసినా ఉద్యమించాలని కఠారిని కోరినట్లు అక్కడక్కడ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే రాబోయే రోజుల్లో వైసిపికి మంచి రోజులు వచ్చినట్టేనని కొందరు వైసిపి నేతలు అనుకుంటున్నారని విశ్వసనీయుల సమాచారం..!