కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో శ్రీ ప్రతిభ విద్యాలయ ప్రాంగణంలో శనివారం ఉదయం 10 గంటల నుండి “కేజీ గ్రాడ్యుయేషన్ డే వేడుక” ఘనంగా నిర్వహించారు. కిండర్ గార్డెన్ విద్యను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా అందరు చిన్నారులు ఈ రోజు ప్రత్యేకమైన డ్రస్సులతో, కేజీ పట్టా, గ్రూప్ ఫోటో, మంచి ప్రవర్తన, అత్యధిక హాజరు, ఉత్తమ చేతిరాత, మొదలైన ఇతర ముఖ్యమైన రంగాలకు ప్రేరణాత్మక ప్రశంసల పదాలతో, ప్రత్యేకమైన రీతిలో, సత్కారాలతో, సమూహ గానం, నృత్య ప్రదర్శనలతో, మనోహరమైన ‘థాంక్యూ టీచర్’ సెక్షన్, ‘స్వీట్ మెమోరీస్’ సెషన్లతో కార్యక్రమం ఆనందంగా, ఉత్సాహంగా జరిగింది. ఇది ఎస్కేజీ విద్యార్థులు సాధించిన మైలురాయి అని, ఈ కార్యక్రమానికి తోడ్పడిన చిన్నారుల తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు, కిండర్ గార్డెన్ విద్యను విజయవంతంగా పూర్తి చేసుకున్న అందరి చిన్నారులకు శుభాశీస్సులు మరియు ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించిన ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీ ప్రతిభ విద్యాలయ అధినేత కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ దాసం శేషారావు పట్టభద్రులకు పట్టాలు అందజేశారు.
ఘనంగా శ్రీ ప్రతిభ విద్యాలయ కేజీ గ్రాడ్యుయేషన్ డే వేడుక
RELATED ARTICLES