రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందినలో ఇసంపల్లి ఆశిష్(19) తన స్నేహితులతో కలిసి పని నిమిత్తం బైక్ పై గర్జనపల్లి నుంచి అడవి పదిర వైపు వెళ్తుండగా వడ్డెర కాలనీ వద్ద గల కల్వర్టు దగ్గర ప్రమాదవశత్తు అదుపుతప్పి పడిపోగా ఆశిష్ తలకు, వెన్నుపూస భాగంలో బలమైన గాయాలు అయ్యాయి. మరో ఇద్దరు స్నేహితులకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. సంఘటన స్థలం నుంచి హుటాహుటిన స్థానికుల సహాయంతో 108లో ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారని అక్కడ చికిత్స పొందుతున్నట్లు అతని తండ్రి కనకయ్య తెలిపారు. ఆపరేషన్ కు లక్షల్లో ఖర్చు ఉన్నందున కుటుంబ పరిస్థితి బాగులేనందున దాతలు 8500817503 ఇసంపల్లి కనకయ్య సెల్ నెంబర్ కు ఫోన్ పే, గాని గుగుల్ ఫే ద్వారా ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ యాక్సిడెంట్ ను పలువురు అనుమానిస్తున్నారు.