రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిష్టం పల్లి వద్ద రాత్రి పూట తన టివిఎస్ వాహనం పై వెళ్తున్న ఇదే మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన మార్వాడి రాములు తన ద్విచక్ర వాహనంపై వెళ్తూ జారీ కింద పడగా అటు వైపు వెళ్తున్న స్థానిక మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ సెస్ హెల్పర్లు ఏనుగుల వెంకటేష్, దాసు లు రాములు కు చెందిన ద్విచక్ర వాహనం ను పక్కకు పెట్టి 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. అదే విధంగా ఒగ్గు బాలరాజు యాదవ్ వెంట ఉన్న రాచర్ల గొల్లపల్లి కి చెందిన అందే శేఖర్ రాములు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకుని రాములు ను వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.