మారుమూల ప్రాంతాలైన ఎల్లారెడ్డిపేట్, వీర్నపల్లి మండలాల్లోని పేద,బడుగు, బలహీన విద్యార్థులకు ఉన్నత విద్య అందాలనే లక్ష్యంతో ఎన్నో ఏళ్ల పోరాటంతో గత ఏడాది ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు అయింది. ఈరోజు మండల కేంద్రములో ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏబివిపి రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎల్లారెడ్డిపేట్ మండల కేంద్రములో ప్రభుత్వ ఇంటర్ కళాశాల లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నడవడం జరుగుతుంది. విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల చేరాలని, రానున్న రోజుల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను రాష్ట్ర స్థాయిలో గొప్పగా తీర్చుదిద్దుదామని కోరారు. ఆయా తరగతుల నిర్వహణకు తరగతి గదులు,ల్యాబ్ లు, బోధన సిబ్బంది కి సరిపోయే విధంగా తాత్కాలికంగా ఒక భవనం తక్షణమే ఏర్పాటు చేయాలని, అన్ని గ్రూపులకు బోధించడానికి సరిపోయే విధంగా బోధన సిబ్బందిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కళాశాల నిర్వహణకు, ప్రయోగశాల సామాగ్రికి, కళాశాల లోని ఫర్నీచర్ కోసం వెంటనే నిధులు విడుదల చేయాలని, వచ్చే విద్యా సంవత్సరం లోగా శాశ్వత భవనం ఏర్పాటు చేయుట కోసం భూకేటాయింపు చేసి భవనం నిర్మాణం చేపట్టాలకి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ సోషల్ మీడియా రాష్ట్ర కో కన్వీనర్ పెండ్యాల శివ, కొప్పుల నవీన్ మందాటి శివప్రసాద్, మిర్యాలకర్ పవన్, తదితరులు పాల్గొన్నారు.