ఆసిఫాబాద్ మండలంలో ఎలాంటి అనుమతులు, రిజిస్ట్రేషన్ లేకుండా కొంతమంది ఫైనాన్స్ పేరుతో అమాయక ప్రజల వద్ద అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఆదేనుసారం ఈరోజు మండలంలో ఏకకాలంలో రిజిస్ట్రేషన్ లేకుండా నడుపుతున్నటువంటి ఫైనాన్స్ కంపెనీల మీద రైడ్ చేసిన పోలీసులు. రైడ్ లో ఎలాంటి అనుమతి, రిజిస్ట్రేషన్ లేకుండా వడ్డీ వ్యాపారం చేస్తూన్న ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి 61 ప్రామిసరీ నోట్లు 32 వివిధ బ్యాంకుల బ్లాంక్ చెక్కులు, 22 అప్పు ఒప్పంద బాండ్ పేపర్లు, 14లక్షల 79 వేల 70 రూపాయల నగదు సీజ్ చేసి దస్నాపూర్ నివాసి తపాసే శ్రీనివాస్, బ్రాహ్మణవాడ నివాసి తనుకు దత్తాత్రి అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అధిక వడ్డీలతో ప్రజలను మోసగించినందున వారి పైన 420 ఐపిసి మరియు తెలంగాణ మనీ లెండర్స్ ఆక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఎవరు కూడా అనుమతి లేకుండా ఫైనాన్స్ కంపెనీలను నడపకూడదని ఆసిఫాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ హెచ్చరించారు.