నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతున్న అర్వింద్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్‌లో అర్వింద్ ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. మృతదేహాన్ని నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి స్వస్థలం సిద్ధిపేట జిల్లా బండారుపల్లిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది