ఏలేరు జలాశయం నుండి దిగువ ప్రాంతాలకు భారీగా వరద నీరు విడుదల చేయడంతో కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం, కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలెం గ్రామంలో ముంపుకు గురై నిరాశ్రాయులైన ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఆదేశాలతో సర్పంచ్ పట్టు చంటిబాబు, ఎంపీటీసీ గరగ గోవిందు ఆధ్వర్యంలో సుమారు 500 మంది బాధితులకు సోమవారం రాత్రి భోజనం, ఈరోజు ఉదయం టిఫిన్ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొజ్జపు శ్రీనివాస్, టిడిపి సీనియర్ నాయకుడు గోడె బాల, మాజీ ఎంపీటీసీలు బొజ్జపు నాగేశ్వరావు, అల్లుమల్ల వెంకన్న, మాజీ సర్పంచ్ తిరుమల్ల సత్యానందం, టిడిపి యువ నాయకుడు అల్లుమల్ల బాబీ, కరణం బూరయ్య, కూటమి నాయకులు పాల్గొని బాధితులకు అండగా నిలిచారు.
వరద బాధితులకు అండగా శృంగరాయునిపాలెం కూటమి నాయకులు
RELATED ARTICLES