ధన దాహంతో తెలంగాణ రాష్ట్రంలోని నీటిపారుదల వ్యవస్థను చిన్న భిన్నం చేసి సర్వ నాశనం చేసిన చరిత్ర కెసిఆర్ దని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కటుకం మృత్యుంజయం తీవ్రంగా విమర్శించారు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కటుకం మృత్యుంజయం మాట్లాడుతూ లక్షల వేల కోట్లు దొంగలించిన పాపాత్ముడు కేసీఆర్ అని 10 సంవత్సరాల కాలంలో దోపిడీ చేసినవాళ్ళు ఎవరంటే కెసిఆర్, కేటీఆర్ మాత్రమేనన్నారు,
యువతకు ఉద్యోగాలు ఇచ్చింది ఏమీ లేదని నీళ్లు నిధులు దోపిడీ చేశారని ఆ కుటుంబానికి డబ్బు లు సంపాదించుకోవడం ఎలా అని ఒకే ఒక ధ్యేయంతో పనిచేశారని ఆయన విమర్శించారు. టిఆర్ఎస్ పార్టీ వారు ఓట్లు అడగడానికి వస్తే తొమ్మిదవ ప్యాకేజీ పనులు ఎందుకు పూర్తి చేయలేదని ఏమి పీకారని రోడ్డుపై నిలబెట్టి నిలదీయాలని ఆయన ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తొమ్మిదవ ప్యాకేజీ పనులు పూర్తి చేసినట్లయితే సింగసముద్రం, జక్కుల చెరువు లతో పాటు ఈ ప్రాంతం సస్యశ్యామలం అయ్యేదని మీ బావ హారిష్ రావు ఈ ప్రాంత ప్రజల నోట్లో మట్టి కొట్టి 11వ ప్యాకేజీ ద్వారా నీళ్లు తీసుకుపోతే చేతగాని దద్దమ్మల చూసు కూర్చున్న కెటిఆర్ కు ఓట్లు అడిగే అర్హత లేదని బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయవద్దని ప్రజలను ఆయన కోరారు. ఇక్కడ చేతకాని ఎమ్మెల్యే ఉన్న ఈ పనులు పూర్తి అయ్యేవన్నారు. తెలంగాణ రాష్ట్ర అంశం మీద అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ను బొంద పెట్టి తర్వాత ఏర్పాటు చేసుకున్న బిఆర్ఎస్ పార్టీ అవదాన దశలో ఉందని చెప్పడానికి ఎలాంటి సందేశం సంకోచం లేదన్నారు. బిఆర్ఎస్ పార్టీలో ఇంకా ఉన్న వలస నాయకులకు కెసిఆర్ కేటీఆర్ కాకమ్మ కథలు చెబుతున్నారని ఆ కాకమ్మ కథలు విని బిఆర్ఎస్ పార్టీలో ఇంకా ఉన్న క్యాడర్ను అభినందించాలని ఆయన అన్నారు.
2019 ఎన్నికల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని పోలీసు యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకుని సీట్లు సంపాదించుకోగలిగిందన్నారు. ప్రజల అభిమానంతో కాదన్నారు. పోలీసుల జీపులో డబ్బులు తరలించి ప్రజలకు పంచి ఓట్లను కొన్నారని ఆయన విమర్శించారు. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ముఖ్యమంత్రి మంత్రులు పర్యటించినప్పుడల్లా పది సంవత్సరాల కాలంలో ఒక్క ప్రతిపక్ష కార్యకర్తను 50 సార్లు పోలీసులు నిర్బంధించినారని ప్రతిపక్ష కార్యకర్తలను నిర్బంధించిన చరిత్ర ఏ రాష్ట్రంలో లేదన్నారు. ఔరంగజేబు, నిజాం నవాబుల కాలంలో నక్సలైట్ల కాలంలో కూడా ప్రతిపక్షాలను నిర్బంధించి ఇంత అణిచివేత లేదన్నారు. కొందరు అధికారులు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లా తొత్తులుగా వ్యవహరించారని ఆయన విమర్శించారు. కవిత మీ అక్కో మీ చెల్లో జైల్లో పడి ఏడుస్తుందని అది ప్రజల కోసం కొట్లాడిన కేసు కాదు కేవలం సారా కేసు ఇంకా మీ మొహాలు చూసి ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేదు మీరు ఖజానా నింపుకొని రాష్ట్ర ఖజానా అంతా ఖాళీ చేశారనే విషయం ప్రజలందరికీ తెలుసునన్నారు. అయ్యా, కొడుకు, బావ, కవితలు ప్రధాని మోడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దయతలిస్తే సంచులు సదురుకొని ఏదో ఓ సంధిలో పడి ఈ దేశం దాటి వెళ్లే పరిస్థితిలో ఉన్నారన్నారు. తెలంగాణ కోసం గొంగళి పురుగునైన ముద్దు పెట్టుకుంటా అన్నవాడు తెలంగాణ పదాన్ని నేడు చంపేశాడని టిఆర్ఎస్ ను ఎప్పుడైతే బొందపెట్టి తెలంగాణ కోసం కొట్లాడినవారి నందరిని బొంత పురుగు లెక్క చూస్తున్నాడని, తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణలోని కవులు కళాకారులు మేధావులు వీరంతా నా వెంట పడతారని బిఆర్ఎస్ పార్టీని స్థాపించాడని ఆయన గుర్తు చేశారు.
దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మతతత్వాన్ని ప్రోత్సహించే భారతీయ జనతా పార్టీ లౌకికవాదాన్ని బలపరిచే కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు తప్ప వేరే పార్టీలకు చోటు లేదు సీటు లేదన్నారు. అన్ని కులాలు అన్ని మతాలు ఎలాంటి అల్లర్లు లేకుండా అన్నదమ్ముల వలె కలిసి ఉండి ప్రశాంతంగా బ్రతకడానికి గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఆన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆయన అన్నారు. కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని ఇప్పటికి వరకు ఎంపిక చేయలేదని అధికార ప్రతినిధిని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం బదులిచ్చారు. విలేకరుల సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, సింగిల్ విండో ఉపాధ్యక్షులు బుగ్గ కృష్ణమూర్తి శర్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి, రఫీక్, ఉప్పుల రవి తదితరులు పాల్గొన్నారు,