వ్యాపార రంగంలో ఎల్లారెడ్డిపేట రోజురోజుకు అభివృద్ధి చెందుతుందని యువత వ్యాపారంలో రాణించాలని టెస్కబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని మాధవి మెస్ పక్కన ఘనగోని బంటి గౌడ్ నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపును టెస్కబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు స్థానిక నాయకులతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాప్ యజమాని బంటి ని అభినందించారు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పిటిసి లక్ష్మణ్ రావు, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, ఎంపీటీసీలు నాగరాణి, అనసూయ, సింగారం మధు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు సుభాష్, నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి, బుచ్చి లింగి సంతోష్ గౌడ్, బిఆర్ ఎస్ పార్టీ యూత్ లీడర్లు రాజిరెడ్డి, దేవరాజు, అనిల్, ప్రమోద్, ఆశీర్వాదం, జోనాథన్, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు,