రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామ రైతుల వరప్రదాయిని సింగ సముద్రం ఆయకట్టుకు సంబందించిన సముద్రం మైసమ్మ పండుగ కోసం ఏర్పాట్లను పరిశీలించిన సింగ సముద్రం కనెక్టింగ్ కాలువల చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్, ఉత్సవ కమిటీ సభ్యులు నేవూరి శ్రీనివాస్ రెడ్డి, రాగుల తిరుపతి రెడ్డి, మేకల శరవింద్. మైసమ్మ గుడి వద్ద లైటింగ్, నీటి వసతి ఏర్పాట్లు పరిశీలించి ఆదివారం సాయంత్రం పూట మొదలై పండగ సోమవారం ఉదయం వరకు కొనసాగుతుందని వారు తెలిపారు. గ్రామంలోని అన్ని వర్గాల దాతలు ఇచ్చిన ఆర్థిక సహాయంతో పండగ నిర్వహణ జరుగుతుందని దైవ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని వారు తెలిపారు .