తలసేమియా, సికిల్ సెల్, రక్తహీనతతో బాధపడె అంతేకాకుండా ప్రాణాపాయ స్థితి నుండి ఆదుకున్నందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ 20వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ రాజభవన్ లో రక్తదాతలను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మాజీ ప్రభుత్వ కార్యదర్శి అజయ్ మిశ్రా, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి మదన్ మోహన్,రాష్ట్ర ఎంసీ మెంబర్ ఇవీ శ్రీనివాస్, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టిన చోన్ గోతు, హెల్త్ కమిషనర్ & డైరక్టర్ RV కర్నన్, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఐఏఎస్ అధికారి బుర్ర వెంకటేశం, సొసైటీ రాష్ట్ర ఎంసీ మెంబర్ సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు ప్రయాకరావు, వేణు కుమార్, సభ్యులు గుడ్ల సునీల్ మెమెంటోలు తీసుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి 676 యూనిట్ల రక్తం అందించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన రాజన్న సిరిసిల్ల పోలీస్ సూపరింటెండెంట్ అఖిల్ మహాజన్ ను జిల్లా ఎస్పీ కార్యాలయంలో కలిసి మెమొంటోతోపాటు ప్రశంస పత్రాన్ని అందించి ఘనంగా సత్కరించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షులు స్టేట్ ఎంసీ మెంబర్ ప్రయాకర్ రావు, వేణు కుమార్ జిల్లా కోశాధికారి బుడిమె శివప్రసాద్, ఈసీ మెంబర్ సంగీతం శ్రీనివాస్, సభ్యులు ఇరుకుల్ల భాస్కర్ పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ గతంలో మంచిర్యాల జిల్లాల్లో కూడా వెయ్యికి పైగా రక్తం యూనిట్లు రెడ్ క్రాస్ సొసైటీ వారికి అందించామని గుర్తు చేశారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం నాకు ఈ ప్రోగ్రాంకు అవార్డు రావడం చాలా సంతోషం. జిల్లాలో రక్త దాన శిబిరాలు అన్ని మండలాల్లో త్వరలో చేపడతానని హామీ ఇచ్చారు.