ఆషాడమాసం మొదటివారం ఆదివారం రోజున జమ్మికుంట పట్టణంలోని కారుటాక్సీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జమ్మికుంట నుండి హుజరాబాద్ వెళ్లే దారి ఇందిరానగర్ లో గల దారి మైసమ్మ గుడి వద్ద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన టాక్సీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మికుంట పట్టణం నుండి సుదూర ప్రాంతాలకు పగలనకా రాత్రనకా రోడ్డు వెంట వెళ్లే క్రమంలో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు సంఘటనలు జరగకుండా ఎల్లవేళలా దారి మైసమ్మ కాపాడుతుందని అందుకు దారి మైసమ్మ తల్లికి గొర్రె పొట్టేలును బలి ఇచ్చి మొక్కు తీర్చుకున్నామని సంతోషం వ్యక్తం చేస్తూ జమ్మికుంట పట్టణంలోని కార్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ యాంసాని శంకరయ్య, వైస్ ప్రెసిడెంట్ మాచర్ల వినయ్, కార్యదర్శి జంగిలి సుధాకర్, సహాయ కార్యదర్శి ఎండి రఫీక్, వీరితోపాటు డ్రైవర్స్ అండ్ ఓనర్స్ బైరి సత్యనారాయణ, రచ్చ రవికృష్ణ, హోటల్ రవి, ఎండి సలీం, ఎండి అక్బర్, డాన్ శీను, బాట శ్రీను, జస్ట్ శీను, మల్యాల తిరుపతి, చెల్పూర్ సారయ్య డ్రైవర్లు పాల్గొన్నారు