భగ భగ మండే ఎండలు తీవ్రత దాల్చుతుంటే ఇంట్లో మంచినీరు లేకుంటే ఆ పరిస్థితి వర్ణనాతీతం. అలాంటిదే ఇక్కడ జరిగింది హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని. కొత్తపల్లి ఐదవ వార్డులో గత ఐదు రోజుల నుండి నీటి సప్లై చేసే మోటర్ చెడిపోయిన కారణంగా వార్డు ప్రజలు నీరు లేక తల్లడిల్లిపోయారు. పరిస్థితిని అర్థం చేసుకున్న ఐదవ వార్డు కౌన్సిలర్.పిట్టల శ్వేతా- రమేష్ లు మున్సిపాలిటీ నీటి ట్యాంకర్ ద్వారా నీరు సప్లై చేసి వార్డు ప్రజల దాహాన్ని తీర్చారు. ప్రజల జీవన మనుగడకు మంచినీరు ఎంత అవసరమో తెలుసుకొని వార్డు ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీరు సప్లై చేయించిన కౌన్సిలర్ శ్వేతా రమేష్ లకు వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు..