Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAకరీంనగర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో అవినీతి అక్రమాలు చేస్తున్న డీ.వై.ఎస్.వో ను సస్పెండ్ చేయాలి

కరీంనగర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో అవినీతి అక్రమాలు చేస్తున్న డీ.వై.ఎస్.వో ను సస్పెండ్ చేయాలి

కరీంనగర్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో డీవైఎస్వి శ్రీనివాస్ డబ్బులు తీసుకుని ప్రైవేట్ ఆర్చర్ అకాడమీకి ఉచితంగా అంబేద్కర్ స్టేడియంలో స్థలం కేటాయించి విద్యుత్ చౌర్యం పాల్పడుతున్న అకాడమీ నిర్వాహకులకు ఆశ్రయం ఇచ్చిన డీవైఎస్ వోను సస్పెండ్ చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ కరీంనగర్ పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో డీవైఎస్ వోగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ తన ఇంటి నెం. 8-2-65/1, భగత్నగర్, కరీంనగర్లో నివాసం ఉంటున్న తన ఇంటి యజమాని కోసం అంబేద్కర్ స్టేడియంలో ఇండోర్ స్టేడియం వెనుక రెండు నుండి నాలుగు గుంటల స్థలాన్ని ఆర్చరి అకాడమీ కోసం కేటాయించడం దుర్మార్గమని అన్నారు.

నగరంలోని వివిధ కోచింగ్ సెంటర్లు అంబేద్కర్ స్టేడియంలో అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్ను అడ్డగా చేసుకొని ఇలాంటి రుసుములు చెల్లించకుండా కోచింగ్ లు ఇస్తున్నాయని కోచింగ్ సెంటర్ల వద్ద నుండి డివైయస్ఓ అడ్డగోలుగా డబ్బులు తీసుకొని ఈ వ్యవహారానికి తెరలేపరని నగరంలోని కోచింగ్ సెంటర్లకు అంబేద్కర్ స్టేడియం అడ్డగా మారడం సిగ్గుచేటు అని ఏ కోచింగ్ సెంటర్ నుంచి ఎన్ని డబ్బులు అంబేద్కర్ స్టేడియానికి చెల్లిస్తున్నారొ డీ.వై.ఎస్.వో ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయాలనే డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఒక కోచింగ్ సెంటర్ అర్చరి నిర్వహించుకోవడం కోసం అంబేద్కర్ స్టేడియంలో గల ఇండోర్ స్టేడియంకు లైట్లు అమర్చుకునేందుకు తన ఇంటి యజమానికి అనుమతి ఇచ్చి ఇండోర్ స్టేడియానికి లైట్లు ఏర్పాటు చేయించడం వెనుక ఎన్ని డబ్బులు చేతులు మారినయో తెలుపలని నగరపాలక సంస్థ వీధి దీపాల నుంచి అక్రమంగా విద్యుత్ లైన్ను ఏర్పాటు చేసి ఆర్చరి స్థలం వద్ద లైట్లు ఏర్పాటు చేసినవారిపై, కోచింగ్ నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ గారికి కూడా పిర్యాదు చేశామన్నారు. తన ఇంటి యజమానికి అంబేద్కర్ స్టేడియంలో స్థలం కేటాయించడమే కాకుండా విద్యుత్ చౌర్యానికి పాల్పడి ఆ స్థలం వద్ద కరెంట్ ఏర్పాటు చేసి ఇంటి యజమానికి అంబేద్కర్ స్టేడియాన్ని తాకట్టు పెట్టిన డీవైఎస్ వో శ్రీనివాస్ గౌడ్ పై సమగ్ర విచారణ జరిపించి సస్పెండ్ చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కె. బద్రినేత పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments