రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట గ్రామ మాజీ సర్పంచ్, జిల్లా వ్యాప్తంగా చరిష్మా కలిగి, ఎందరో అనుచరులు, అభిమానులు కలిగిన నేత నెవూరి వెంకట్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తనతోపాటు తన ముఖ్య అనుచరులను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు. పార్టీ ఎదుగుదలకు ఎంతో కృషి చేశారు. తర్వాత కాలంలో టీఆర్ఎస్ పార్టీలో చేరినా, మనసంతా కాంగ్రెస్ వైపే ఉండేది. మండల, జిల్లా స్థాయిలో తన అభిమాన నాయకుల కటౌట్ లు పెట్టీ, ప్రజల మనసులు చూరగొనేవారు. వెంకట్ రెడ్డి ఏది చేసినా అద్భుతమే అనే విధంగా ఉండేది. పార్టీ మీటింగ్ లకు సభలకు జన సమీకరణ చేయటంలో దిట్ట. పార్టీ సేవలు వెంకట్ రెడ్డి కి అవసరం అని కాకుండా, వెంకట్ రెడ్డి సేవలు పార్టీకి అవసరం అనే విధంగా ఉంటాయి. తను సర్పంచ్ గా ఉన్నపుడు, యెల్లారెడ్డి పేట గ్రామ అతి పురాతన శ్రీ వేణు గోపాల స్వామి దేవాలయంకు దళితున్ని చైర్మన్ ను చేసి, రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు. తనను అభిమానించే వారు ఎంతటి కష్టాల్లో ఉన్నా, ఒంటి చేత్తో ఆదుకునే నైజం కలిగిన వ్యక్తి. వెంకట్ రెడ్డి రాకతో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకుంటుంది అని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. వెంకట్ రెడ్డి దంపతులు పది సంవత్సరాలు ఎల్లారెడ్డి పేట గ్రామాన్ని పాలించి, ఎంతో అభివృద్ధి పరిచారు. పది సంవత్సరాల క్రితం, పది సంవత్సరాల తరువాత అనే విధంగా ఉంటుంది. బస్సులో ప్రయాణించే వారు ఎల్లారెడ్డి గ్రామ జిగేల్ మనే వెలుగులు ఇది ఏ పట్టణం అని కండక్టర్ ను అడిగిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. దూర దేశాలు వెళ్లి, ఎల్లారెడ్డిపేటకు వచ్చిన వాళ్ళు, ఇది నా ఊరేనా, ఇంత అభివృద్ధి చెందింది అనే విధంగా ఉంటుంది. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ లో చేరటంతో, పార్టీకి మంచిరోజులు వచ్చాయి అని కార్యకర్తలు అంటున్నారు.