రాజన్న సిరిసిల్ల జిల్లా గంబీరావుపేట మండలం పెద్దమ్మ అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వక్తులు అక్కడిక్కడే మృతి చెందారు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బిక్నూరు మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్లా, ఎస్ డి చందా అనే ఇద్దరు వ్వక్తులు ద్విచక్ర వాహనంపై వేములవాడ కు వెళ్తున్నారు ఈ సమయంలో పెద్దమ్మ స్టేజి మూలమాలుపు వద్ద ఎదురుగా వస్తున్న డిసీఎం కింద అదుపుతప్పి పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీస్ లు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కు తరలించి కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు