గుంటూరు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజుపై ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ అసహనం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పును కన్నా తప్పుబట్టారు. కోర్ కమిటిలో చర్చ జరగకుండానే జిల్లా అధ్యక్షులను మార్చారని అన్నారు. ‘‘అధ్యక్షుల మార్పు నాతో చర్చించలేదు. ఇప్పుడు తొలగించిన వాళ్లంతా నేను నియమించిన వాళ్లే. కోర్ కమిటి సమావేశం తప్ప పార్టీలో ఇతర ఏ సమాచారం మాకు తెలియడం లేదు. నేను రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఎంతో మందిని బీజేపీలో జాయిన్ చేశాను. ఇప్పుడు వాళ్లంతా ఎందుకు పార్టీ వీడుతున్నారో వీర్రాజు సమాధానం చెప్పాలి. తన వియ్యంకుడు బీఆర్‌ఎస్‌లో ఎందుకు చేరాడో సోము వీర్రాజును అడగాలి. ఎంపీ జీవీఎల్ ఆలోచన స్థానిక బీజేపీ కార్యకర్తల అభిప్రాయాలకు ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. అమరావతి రాజధాని సహా అనేక అంశాలలో జీవీఎల్ వైఖరి చూశాం. జగన్ కేసీఆర్ కుట్రలో భాగంగానే బీఆర్ఎస్‌లోకి ఏపీ నేతలు. ఆంధ్రాలో పవన్, తెలంగాణలో బండి సంజయ్ ను వీక్ చేసే కుట్ర జగన్, కేసీఆర్‌లు కలిసి చేస్తున్నారు. ఒన్ షాట్ టూ బర్డ్స్‌గా కాపు నేతలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. పవన్‌కు మేమంతా అండగా ఉంటాం. కాపులపై ఈ మధ్య కాలంలో మీడియా దుష్ప్రచారం చేస్తోంది’’ అంటూ కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేశారు.
సోమువీర్రాజు తీరుపై కన్నా అసహనం
RELATED ARTICLES