రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో మధ్యాహ్న సమయంలో ఎస్సై రమాకాంత్ కి వచ్చిన సమాచారం మేరకు ఎల్లారెడ్డిపేట శివారులో ఉన్న కేశవ పెరుమాండ్ల గుట్ట ప్రాంతంలో కొందరు జూదమాడుతున్నారని ఎస్ఐ రమాకాంత్ తన సిబ్బందితో, పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఎల్లారెడ్డిపేట శివారులో ఉన్న కేశవ పెరుమాండ్ల గుట్ట వద్దకు వెళ్లగా అక్కడ ఏడుగురు వ్యక్తులు జూదం ఆడుతూ ఉండగా వారిని పట్టుకుని వారి వద్ద నుండి నగదు 20,080 రూపాయలు, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఏడు సెల్ ఫోన్లు, జూద సామాగ్రిని స్వాధీనం చేసుకొని వారిని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండల శివారులో ఎవరు జూదం ఆడిన ఆ జూద వివరాలు తెలిపిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడునని ఎస్ఐ రమాకాంత్ తెలిపారు. తనిఖీలలో ఎల్లారెడ్డిపేట హెడ్ కానిస్టేబుల్ శంకరయ్య, పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్, దిలీప్, బాబయ్య, రాజేందర్ లు పాల్గొన్నారు