రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన లింగాల సురేష్ గౌడ్, s/0 బాలరాజు అనే వ్యక్తి శుక్రవారం ఎల్లారెడ్డిపేట గొల్లపల్లి ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న మహేంద్ర షోరూం ఎదురుగా రోడ్డు ప్రక్కన అనుమానస్పదంగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తునారు. మృతుని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పిటల్ తరలించారు. మృతినికి భార్య కూతురు కుమారుడు ఉన్నారు. మృతుడు మహారాష్ట్ర నుంచి మూడు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడని గ్రామస్తులు తెలిపారు