పార్లమెంట్ ఎన్నికల కోడ్ మేరకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వేసిన వివిధ రాజకీయ పార్టీల వాల్ పోస్టర్లను ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ సిబ్బంది మంగళవారం తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామపంచాయతీ కార్యదర్శి దేవరాజు ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ సిబ్బంది వివిధ రాజకీయ పార్టీలు మండల కేంద్రంలో వివిధ చోట్ల వేసిన వాల్ పోస్టర్లను వివిధ రాజకీయ పార్టీల జెండాలను తొలగించి గ్రామపంచాయతీ కార్యాలయానికి తరలించారు. ఎన్నికల కోడ్ ఉన్నందున వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల కోడ్ తూచా తప్పకుండా పాటించి తమకు సహకరించాలని గ్రామపంచాయతీ కార్యదర్శి దేవరాజు వివిధ పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేశారు,