Wednesday, May 29, 2024
spot_img
HomeTELANGANAతెలంగాణని దోచుకోవడానికే KCR, KTR హరీష్ రావు ఆరాటం.

తెలంగాణని దోచుకోవడానికే KCR, KTR హరీష్ రావు ఆరాటం.

కన్నతల్లి గురించి మాట్లాడే అర్హత కేసిఆర్ కు కేటీఆర్ కు హరీష్ రావుకు లేదు
గల్లీ నుంచి ఢిల్లీ దాకా మీ అవినీతి ఆక్రమాలు రాజ్యమేలుతుంటే మీ చెల్లి కవితమ్మ లిక్కర్ దందాతో తీహార్ జైల్లో కూర్చుంది,
ఆఖరుకు భార్య భర్తల సెల్ ఫోన్ల సంభాషణలు కూడా వదలక పోతిరి,
కాంగ్రెస్ పార్టీ లో పాత వారిని గౌరవిస్తూనే కొత్తవారికి ప్రాధాన్యత ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు

తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకోవడానికే మీ ఆరాటం పోరాటమని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను, మాజీ మంత్రులు కెటిఆర్, హారిష్ రావు లను ఉద్దేశించి సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం రాచర్ల బొప్పాపూర్ మాజీ సర్పంచ్ కొండాపూర్ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో 100 మంది, ఎల్లారెడ్డిపేట మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు నంది కిషన్ ఆద్వర్యంలో 10, దుమాల మాజీ ఎంపీటీసీ కదిరే బాలకిషన్ గౌడ్ ఆధ్వర్యంలో 10 మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్రెడ్డి మాట్లాడుతూ మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీలో చేరిన అందరికీ ఆయన అభినందనలు తెలిపారు. గత బిఆర్ ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. బడుగు బలహీన వర్గాల పేద వర్గాల సంక్షేమానికి పాటుపడేది మైనార్టీ దళిత గిరిజనులకు అండగా ఉండే పార్టీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు రాజకీయ పునారీకరణ జరిగేందుకు వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో ప్రజా పాలనలో సేవలు చేయడానికి చేరుతున్నారని ఆయన గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీలో పాతవారిని గౌరవిస్తూనే కొత్త వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు

మాజీ మంత్రి కేటీఆర్ కల్లు తాగిన కోతి వలె పిచ్చి పట్టి అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడని తాను తౌడు తింటే మిర్చీలు తిన్నట్టా ఇతరులు తింటే అది గడ్డి తిన్నట్టా కేటీఆర్ మాటలు అలా ఉన్నాయన్నారు. పార్టీలు మారితే కన్నతల్లికి ద్రోహం చేసినట్టా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇస్తే తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీ ఎటువంటి ద్రోహం చేసిందో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని కన్నతల్లి గురించి మాట్లాడే అర్హత, నైతికత విలువలు కేసిఆర్ కు గాని, కేటీఆర్, హరీష్ రావు లకు లేదన్నారు, మిమ్మల్ని నమ్మి 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని ఏరకంగా దోచుకొని దాచుకున్నారో అవినీతి, అక్రమ నియంతృత్వ పోకడలతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించారో ప్రజలందరూ గమనించారన్నారు, తమ దరిద్రమైన దుర్మార్గమైన నియంతృత్వ ఆలోచనలతో ఆఖరికి సెల్ఫోన్లో భార్యాభర్తలు మాట్లాడే సంభాషణలను ఫోన్ టాపింగ్ చేసి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో చిన్న భిన్నమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేశారో ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. నికృష్టమైన ఆలోచనలకు చరమగీతం పాడుతూ ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు మార్పు కోరుకున్నారు అని ఆయన గుర్తు చేశారు.

గల్లీ నుంచి మొదలు ఢిల్లీ దాకా మీ అవినీతి ఆక్రమాలు రాజ్యమేలుతుంటే మీ చెల్లి కవితమ్మ లిక్కర్ దందతో తీహార్ జైల్లో కూర్చుని తెలంగాణ ప్రాంత సభ్య సమాజం సిగ్గుపడే విధంగా తెలంగాణ ఆడపడుచులను అవమానపరిచినారన్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఆడపడుచులకు ఆరాధ్య దైవమైన బతుకమ్మ పండుగను ఒక బూచిగా చూపి సెంటిమెంటుతో తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలని మీరు చెప్పిన మాటలు బోగస్ అనేది తేట తెల్లమైందన్నారు. తెలంగాణ ప్రజలందరూ గమనించి బిఆర్ ఎస్ పార్టీ నియంతృత్వ, నికృష్ట అవినీతి ఆలోచనలను ఎండగడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజాస్వామిక తీర్పునిచ్చారని, ఇప్పటికైనా చిల్లర మల్లర మాటలను మానుకోవాలని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లను కే కే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నరసయ్య , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా రేవంత్ రెడ్డి టీం అధ్యక్షులు గూడ విజయ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ గౌస్ బాయి, లింగం గౌడ్, సూడిది రాజేందర్, బానోతు రాజు నాయక్, చేపూరి రాజేశం, సాహెబ్, మర్రి శ్రీనివాస్ రెడ్డి, బండారి బాల్ రెడ్డి, కొండాపురం శ్రీనివాస్ రెడ్డి, సిరిపురం మహేందర్, నరేందర్, గంట బుచ్చ గౌడ్, రవి, పందిర్ల సుధాకర్ గౌడ్, ఇమామ్ బాయి, బుచ్చి లింగి సంతోష్ గౌడ్, అంతేర్పుల గోపాల్, గంట వెంకటేష్ గౌడ్, చెట్కూరి బాలా గౌడ్, ఆంజనేయులు గౌడ్, తిరుపతి గౌడ్, దండు శ్రీనివాస్, మహిళా మండల అధ్యక్షరాలు ఆకుల లత, గౌస్ బాయి, కిష్టారెడ్డి, శ్రీనివాస్, మల్లారెడ్డి, కిషన్, ఉప్పల రవి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బి పేట రాజ్ కుమార్, వెంకట్ రెడ్డి వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments