Wednesday, September 16, 2026
spot_img
HomeTELANGANAఎల్లారెడ్డిపేట మండలంలో ఘనంగా దీపావళి పండుగ లక్ష్మీ పూజలు

ఎల్లారెడ్డిపేట మండలంలో ఘనంగా దీపావళి పండుగ లక్ష్మీ పూజలు

ఎల్లారెడ్డిపేట మండలంలో గురువారం దీపావళి పండుగ లక్ష్మీ పూజలు ఘనంగా జరిగాయి. దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు బారిగా టపాసులు కాల్చి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. వివిధ రకాల వ్యాపారులు తమ తమ దుకాణాలలో రంగు రంగుల విద్యుత్ దీపాలతో పూలతో అందంగా ఆకర్షణీయంగా అలంకరించుకొని గురువారం సాయంత్రం గ్రామ పురోహితులు రాచర్ల దయానంద్ శర్మ, కృష్ణ మూర్తి శర్మ, హాన్మాండ్ల శర్మ, గుండయ్య శర్మ, గోపాల్ చారి, నవీన్ చారి, ఉమా శంకర్ పంతులు ఆద్వర్యంలో లక్ష్మి పూజలు చేశారు. ఈ సందర్భంగా కీర్తిశేషులు స్వర్గస్తులైన తన తల్లిదండ్రుల పేరిట గల నేవూరి లక్ష్మి మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్లు నేవూరి వెంకట్ రెడ్డి నేవూరి మమతారెడ్డిలు లక్ష్మి పూజలు నిర్వహించారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పూజారి బిటుకూరి నవీన్ చారి లక్ష్మీ పూజలను వారితో చేయించారు. ఈ సందర్భంగా వారు ఎల్లారెడ్డిపేట గ్రామ మండల ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఆనందోత్సవాల మధ్య పండుగను జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. అదే విధంగా ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి తన నివాసంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఆనందోత్సవాల మధ్య పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎల్లారెడ్డిపేట గ్రామ మండల ప్రజలకు దీపావళి పండుగ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, ఎఎంసి చైర్మన్ షేక్ సబేరా బేగం, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గౌస్ బాయి, ఎఎంసి వైస్ చైర్మన్ గుండాడి రామ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి – పుష్పాలత దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆనందోత్సవాలతో దీపావళి పండుగను జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. మూడు పూలు ఆరు కాయలుగా వ్యాపారులు స్థానిక పోలీసుల, సిరిసిల్ల ఆగ్ని మాపక సిబ్బంది అండదండలతో యదేచ్చగా టపాసుల వ్యాపారాన్ని ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి కొనసాగించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments