మా అభాగ్యుల వృద్ధాశ్రమంలో ఘనంగా సోసైటీ ఐదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగానిర్వహించిన మా అభాగ్యుల వృద్ధాశ్రమం నిర్వహాకులు మాజీ ZPTC సభ్యులు మల్లు గారి నర్సాగౌడ్. సేవే లక్ష్యంగా సామాజిక సేవారంగంలో సింగారం గ్రామ హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీ విశిష్ట సేవలు అందిస్తుందని గంభీరావుపేట మా అభాగ్యుల వృద్ధాశ్రమం నిర్వహాకులు మాజీ ZPTC మల్లు గారి నర్సాగౌడ్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలోని హెల్పింగ్ హాండ్స్ వెల్ఫేర్ సొసైటీ ఐదవ వార్షికోత్సవ వేడుకలను గంభీరావుపేట మండల కేంద్రంలోని మా అభాగ్యుల వృద్ధాశ్రమంలో, ఐదవ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సొసైటీ సభ్యులు వృద్ధుల మద్య ఓ అనాధ వృద్ధురాలితో కేక్ కట్ చేయించి వేడుకలు నిర్వహించి పలువురి కి ఆదర్శంగా నిలిచారు.
ఈ సందర్భంగా మా అభాగ్యుల వృద్ధాశ్రమం నిర్వహాకులు మాజీ ZPTC మల్లు గారి నర్సాగౌడ్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో ఐదు సంవత్సరాల క్రితం సింగారం గ్రామంలో నవీన్, నాగరాజు, సురేష్, స్వామి, విజయ్, మల్లేష్, శ్రీనివాస్, శమీర్, సొసైటీ గా ఏర్పాటు చేసుకొని ఒకరికొకరు తోడుగా ఉండి సమాజసేవ అందించాలనే సేవ దృక్పథంతో మొదలైన మీ ఆలోచనలలో లక్ష సిద్ధి ఉందన్నారు. అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నారని వారిని ఆయన అభినందించారు. సమాజంలో ఇబ్బందుల్లో ఉన్నవారిని అనాధలైన వారికి మేమున్నాము అని సింగారం హెల్పింగ్ హాండ్స్ వెల్ఫేర్ సొసైటీ ధైర్యాన్నిస్తుందన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి సమాజానికి సేవ చేయడానికి ఐక్యమత్యంగా కలిసి ఉండి స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న యువత దేశానికి ఎంతో అవసరమన్నారు. ఆదివారం వృద్దులందరికి ఆరోగ్య కరమైన రుచికరమైన భోజనాన్ని అందించారు. సన్మార్గంలో మన విలువలను కాపాడుకుంటూ సమసమాజ నిర్మాణం కోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. వేసవికాలం సమీపిస్తుండటంతో వృద్ధులకు మూడు సీలింగ్ ఫ్యాన్లు, 25 కిలోల బియ్యం వితరణ చేశారు, మా అభాగ్యుల వృద్ధాశ్రమంలో కరెంటు ఫిట్టింగ్ పూర్తిగా చేయించి సింగారం హెల్పింగ్ హాండ్స్ వెల్ఫేర్ సొసైటీ వారు సహాకరించారని వారికి వృద్ధాశ్రమం నిర్వహాకులు మల్లు గారి నర్సాగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు..