వివాదాస్పద ట్వీట్ లు చేసి మన భారతీయ సినిమాల మీద రివ్యూ ల పేరిట వివాదాస్పద ట్వీట్ లు పెట్టే ఉమైర్ సంధు కూడా తన ట్విట్టర్ లో రష్మికని కన్నడ సినిమా పరిశ్రమ నిషేధిస్తోంది అని చెప్పాడు. అధికారికంగా ఆ వార్తా రావలసి వుంది అని కూడా అతను చెప్పాడు. అయితే కర్ణాటక లో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా చాల గట్టిగా తీసుకుంటారు. అక్కడ ప్రజలే నిర్ణయిస్తారు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలో. అటువంటి నిర్ణయమే అప్పట్లో ఒకటి తీసుకున్నారు కదా. అందువల్లే ఈరోజుకి కాన్రాటక లో డబ్బింగ్ సినిమాలు విడుదల కావు అసలు. అటువంటిది ఇప్పుడు రష్మిక మీద కూడా డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ల ఓనర్లు, సినిమా పరిశ్రమకి చెందిన వారు ఆమె కన్నడ పరిశ్రమని అగౌర పరిచిందని నిషేధం విధించారని అంటున్నారు. ఈ వార్త సాంఘీక మాధ్యమాల్లో కూడా బాగా చక్కర్లు కొడుతోంది కూడా. ఇది ఎంతవరకు నిజమో ఇంకా తెలియాల్సి వుంది.
రానున్న రోజుల్లో రష్మిక రెండు పెద్ద సినిమాల్లో నటిస్తోంది. ముందుగా విడుదల అయ్యేది విజయ్ తో నటిస్తున్న ‘వారిస్’ తమిళ్ చిత్రం కాగా, రెండోది అల్లు అర్జున్ తో నటిస్తున్న ‘పుష్ప 2’ సినిమా ఒకటి. ఒకవేళ రష్మిక నిషేధం కానక నిజం అనుకుంటే, ముందుగా విజయ్ చిత్రం ‘వారిస్’ కర్ణాటక లో విడుదల కాకుండా ఆడుకుంటారు.
రష్మిక ఒక ఇంటర్వ్యూ లో తనకి అవకాశం ఇచ్చిన కన్నడ ప్రొడక్షన్ హౌస్ గురించి పేరు చెప్పకుండా దాటేసారు. అదీ కాకుండా ‘సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్’ అని చేతులతో సైగలు చేసి చూపించారు. దీనికి ఆగ్రహించిన కన్నడ ప్రేక్షకులు ఆమె మీద నెగటివ్ కామెంట్స్, ట్రోల్స్ చేసారు. ఆమెకి అవకాశం ఇచ్చిన వ్యక్తి రక్షిత్ శెట్టి, దర్శకుడు రిషబ్ శెట్టి ‘కిరాక్ పార్టీ’ అనే సినిమా ద్వారా. రక్షిత్ శెట్టి తో రష్మిక పెళ్లి ఫిక్స్ అయింది, కానీ ఈలోపు తెలుగులో పెద్ద అవకాశాలు రావటం తో ఆయనతో బ్రేక్ అప్ అయింది.
అయితే రష్మిక మందన్న ఈ నిషేధం గురించి తన ట్విట్టర్ లో మాట్లాడుతూ ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పింది. కన్నడ చిత్ర పరిశ్రమలో వున్నా పెద్దలతో మాట్లాడాను అని వ్యక్తిగత కారణాలతో ఒక వ్యక్తిని ఆలా నిషేధించలేరని ఆమె చెప్పింది. ఇప్పుడు ఇదే విషయం మీద చర్చ నడుస్తోంది.