రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ లోని ఇందిరమ్మ కాలనీకి చెందిన గౌస్ ఆటోకార్మికుడిగా ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గౌస్ నిన్న రాత్రి మరణించాడు. దింతో ఆ కుటుంబం పెద్ద దిక్కుని కోల్పోయింది. గౌస్ అంత్యక్రియల కోసం అతని కుమారుడు రియాజ్ కు ఒగ్గు మల్లయ్య యాదవ్ కుమారులు మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కాలనీ డెవలప్ మెంట్ కమిటీ చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్, ఎల్లారెడ్డిపేట యాదవ్ యూత్ టౌన్ ప్రెసిడెంట్ ఒగ్గు మహేష్ యాదవ్ లు 4,000 రూపాయలు అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయం గౌస్ కుమారుడు రియాజ్ కు అందజేశారు. వీరి వెంట తుమ్మ శంకర్, షాదుల్, శివరాత్రి రమేష్ ఉన్నారు. ఎవరైనా గౌస్ కుటుంభానికి ఆర్థిక సహాయం అందించాలనుకునే వారు గౌస్ కుమారుడు 9705246653 రియాజ్ కి పోన్ పే చేయగలరని ఒగ్గు బాలరాజు యాదవ్, మహేష్ యాదవ్ లు కోరారు.