Monday, August 10, 2026
spot_img
HomeTELANGANAబొల్లారం, చిన్న కమేళాలలో పలు చోట్ల శ్రీరామనవమి వేడుకలు హాజరైన MLA శ్రీగణేష్

బొల్లారం, చిన్న కమేళాలలో పలు చోట్ల శ్రీరామనవమి వేడుకలు హాజరైన MLA శ్రీగణేష్

శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం కంటోన్మెంట్ నియోజకవర్గం వ్యాప్తంగా పలు కాలనీలు, బస్తీలలో రామాలయాలు, ఆంజనేయ స్వామి దేవాలయాలలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. బొల్లారంలోని డౌటన్ బజార్, కలాసిగూడ, రిసాల బజార్, సదర్ బజార్, వార్డు 7 చిన్న కమేళా, లాల్ బజార్ లలో నిర్వహించిన వేడుకలకు ఆయా దేవాలయాల పాలక మండళ్లు, అధికారులు, కాలనీ, బస్తీల పెద్దల ఆహ్వానం మేరకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ హాజరై సీతారాముల కల్యాణాన్ని తిలకించి దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్ధించారు. ఈ వేడుకలలో ఎమ్మెల్యే శ్రీగణేష్ వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు వేణు గోపాల్ రెడ్డి, నాగినేని సరిత, మురళీ ముదిరాజ్, బాలరాజు, రామ్, భీం రాజు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments