ఈ నెల 12 న ప్రతిమ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో ఆరు విభాగాల వైద్యులతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, ఉచితంగా మందులు అందజేయనున్న ప్రతిమ మెడికల్ కళాశాల వైద్యులు. ఎల్లారెడ్డి పేట మండల కేంద్రములో గల రైతుచర్చ మండలిలో ఈ నెల 12 న నంగునూర్ ప్రతిమ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ప్రతిమ మెడికల్ క్యాంప్ ఆర్గనైజర్ ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ తెలిపారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 3గంటల వరకూ కొనసాగుతుందని తెలిపారు. ఎం.డి పిజిషియన్,ఎం డి సర్జన్ , ఆర్థో (కీళ్ళ వైద్యులు) కంటి డాక్టర్, పిల్లల వైద్య నిపుణులు, గైనకాలజిస్ట్ వైద్యులు హజరవుతారని వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఒగ్గు బాలరాజు యాదవ్ కోరారు. వైద్య శిబిరం విజయవంతం కావడానికి మహిళ సంఘాల సి ఏ లు, అంగన్ వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎం లు ఆశా వర్కర్లు, కుల సంఘాల సభ్యులు, యూత్ సంఘాల సభ్యులు సహకరించాలని ఒగ్గు బాలరాజు యాదవ్ కోరారు. ఏర్పాట్లు పరిశీలనలో ఒగ్గు బాలరాజు యాదవ్ తో పాటు రైతు చర్చ మండలి అద్యక్షులు సందుపట్ల రాజిరెడ్డి, రెడ్డి సంఘం మండల మాజీ అధ్యక్షులు గన్న మల్లారెడ్డి, రాగుల ఎల్లారెడ్డి, నేవూరీ శ్రీనివాస్ రెడ్డి, గన్న బాల్ రెడ్డి, గన్న రాం రెడ్డి, సంపత్ కుమార్, డాక్టర్ రమేష్, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ చైర్మన్ జితేందర్, వైస్ చైర్మన్ గంట వెంకటేష్ గౌడ్, ప్రతిమ మెడికల్ కళాశాల కో – ఆర్డినేటర్ రాజి రెడ్డి పాల్గొన్నారు.