మంగళవారం రోజున జమ్మికుంటలో జరుగబోయే జన జాతర సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మనకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు తో పాటు జమ్మికుంటలో ఆయన సభా స్థలిని, హెలిప్యాడ్ ను పరిశీలించారు.ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ 60 వేల మందితో జమ్మికుంటలో జన జాతర సభనిర్వహిస్తున్నామని వేసవి దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేశామని హుజురాబాద్ నుండి జన జాతర సభను భారీ ఎత్తున విజయవంతం చేయాలని కేంద్రంలోని మోడీ చేస్తున్న అవినీతి పాలనపై, 50 రోజుల్లో ధరలను తగ్గిస్తానని చేయలేదని. ధరలు ఆకాశం పైకి పోయాయి.పెట్రోల్,డీజల్ నిత్యావసర వస్తువుల ధరలు అన్ని పైకి వెళ్ళాయని అన్నారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి హయంలో 20 వేల కోట్ల రూపాయలను కొట్టేశాడని తాళి బొట్లు అమ్ముకునే అనే వాళ్లకు ఆళి విలువ ఏం తెలుస్తుంది.భారతదేశపు ఆస్తిని అధానికి అంటగట్టాడని. సీబీఐ,ఈడి,ఐటి దర్యాప్తు సంస్థలను దగ్గరపెట్టుకొని అడిస్తున్నాడని, ఎలక్ట్రోరల్ బాండ్ ల వివరాలను విడుదల చేయడం లేదు. అర్హులు కానీ వారు కూడా ఎన్నికల బాండ్ లను కొన్నారు. 20 కంపెనీలు అలాగే ఉన్నాయి ఇదికాదా అవినీతి.
శరత్ చంద్ర లాంటి వాళ్ళు క్విడ్ ప్రో కో చేశారు. కప్పం కట్టందే కేసులు మాఫీ కాలేదు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది మోడీ మాట్లాడుతుంది అని అన్నారు. బిజేపి అభ్యర్థి బండికి చదువు లేదు ఏం లేదు పొద్దున్న లేస్తే దేవుడి పేరు తప్ప ఏం లేదు. మొన్నటి ఎన్నికల్లో ఒక నియంతను బొంద పెట్టారు. రేపు కేంద్రంలో కూడా ఇలాగే జరుగుతుంది. మా కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు గురించి మాట్లాడిన కేటీఆర్, నువ్వు రాజకీయాలకు రానప్పుడు చొప్పదండి నియోజక వర్గంలో కేసిఆర్ తో బి ఫాం వేసిన వ్యక్తి రాజేందర్ రావు 2009లో కరీంనగర్ నుండి పోటీ చేసిన వ్యక్తి రాజేందర్ రావు, పరిచయం అక్కరలేని వ్యక్తి కరీంనగర్ కు నువ్వు ఒక వలస వాది. హన్మకొండ నుండి వచ్చిన వినోద్ కుమార్ వలస వాదిని తెచ్చుకున్నారు. ఇక్కడే పుట్టి పెరిగిన వ్యక్తి రాజేందర్ రావు. సర్పంచ్ కూడా గెలవనోడు ఎంపీ గా పోటీ చేస్తున్నారు.అభ్యర్థులు దొరకని పరిస్థితి లో ఉంది బిఆర్ఎస్ పార్టీ. రాముని మీద రాజకీయం చేస్తే ఓట్లు పడవని .ఓట్ల కోసం దేవుని అక్షింతలు ఇంటి ఇంటికి పంపించారు.వారి మీద వారికి నమ్మకం లేక దేవుళ్ళను వాడుకుంటున్నారని దుయ్యబట్టారు