తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, సకల జనులకు న్యాయం చేకూర్చడమే లక్ష్యంగా కృషి చేస్తున్న జనహృదయనేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినం సందర్బంగా ముస్లింల ప్రముఖ పుణ్యక్షేత్రం బిజిగిర్ షరిఫ్ దర్గాలొ శుక్రవారం రోజున హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు మొహమ్మద్ తౌఫిక్ హుస్సేన్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ తరపున దర్గాలోని హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి రహమతుల్లా అలై, హజ్రత్ సయ్యద్ అజ్మత్ షావలి, హజ్రత్ సయ్యద్ అక్బర్ షావలి, హజ్రత్ సయ్యద్ ముర్తుజాషావలి రహమతుల్లాహ్ అలై, సమాధులకు చాదర్లు సమర్ఫించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి దేశంలోనే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుంచాలని, బడుగు బలహీన వర్గాలకు మరిన్ని సేవలు చేయాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినారు.
ఈ సందర్భంగా తౌఫీక్ హుస్సేన్, మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టినక అనేక చారిత్రాత్మక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినారని అందులో ముఖ్యంగా రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గురుకుల పాఠశాలకు నలుభై శాతం మెస్ చార్జీలు పెంచడం, విద్యావ్యవస్థలో సమూల మార్పు, పదకొండు వందల కోట్లతో అమ్మ ఆదర్శ పాఠశాలలు, టీచర్ల నియామకం, వైద్య విద్య ఉపాధి పై ప్రత్యేక శ్రద్ధ చూపించారని చెప్పినారు. ఈ కార్యక్రమంలో బిజిగిర్ షరిఫ్ మత గురువులు మౌలానా గులామ్ యాసిన్ సాహబ్, ఖాజా పాషా సాహబ్ తో పాటు దర్గా కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఇక్బాల్, దర్గా కమిటీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ కరీం, దర్గా కమిటీ కార్యనిర్వాహణ అధ్యక్షుడు మొహమ్మద్ తౌఫీక్ హుస్సేన్, జమ్మికుంట మైనార్టీ సెల్ నాయకులు మహమ్మద్ అలీ షరీఫ్, అజ్మత్, అబ్బాస్, సర్వర్, గౌస్, సాదిక్, ఫక్రుద్దీన్, అల్తాఫ్ ఇమ్రాన్ తదితరులు పాల్గున్నారు …..



