82వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్) జనవరి 1న రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించనున్నారు. ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి టీ.హరీశ్‌రావు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15 వరకు సుమారు 45 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగనుంది. నిజాం కాలం నుంచి ప్రతి యేడు హైదరాబాద్ లో నిర్వహించే ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. జనవరి 1న సాయంత్రం ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ సభలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివా్‌సయాదవ్ గౌరవ అతిఽఽథులుగా పాల్గొంటారని ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి వి.సాయినాధ్ దయాకర శాస్త్రి తెలిపారు.