రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ కేంద్రంలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ లో వేములవాడ పట్టణ ఎస్ఐ సముద్రాల రాజు ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు చెడు అలవాట్లు అయిన ధూమపానము మరియు మద్యపానములు సంక్రమించే విధానం మరియు వాటి వలన జరిగే అనర్ధాలు గురించి వివరించారు. మైనర్లు డ్రైవింగ్ చేయడం వలన జరిగే ప్రమాదాలు, వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించడం వలన కలిగే ఉపయోగాలు, ధరించకపోవడం వలన జరిగే అనర్ధాలు వివరించారు. తాను నిజజీవితంలో విజయవంతం అవ్వడానికి జరిగిన సంఘటనలను వివరిస్తూ విద్యార్థులలో స్ఫూర్తి నింపారు. ఈ కార్యక్రమంలో TGMRS ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు