గోవిందా ,,,, గోవిందా,,,, నామస్మరణతో గంభీరావుపేట మార్మోగింది కమనీయం,,,, రమనీయంగా,,,,,, శ్రీ సీతా రామచంద్రస్వామి రథోత్సవం గురువారం గంభీరావుపేట మండల కేంద్రంలో వైభోపేతంగా జరిగింది, శ్రీరామ నవమితో మొదలైన బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు ఉదయం ఆలయం నుండి బయలుదేరిన స్వామి వారి రథోత్సవం గ్రామంలోని శ్రీ సీతారామ బజారు పురవీధుల గుండా ఊరేగించారు, పెద్ద ఎత్తున భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారికి మహిళలు మంగళహారధులతో పాటు కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పరిసర ప్రాంతాలకు చెందిన వేలాదిమంది భక్తులు రథోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఆలయంలో తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి, రథోత్సవం పురస్కరించుకొని గ్రామంలో జాతర సందడి నెలకొంది రథోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగ కుండా ఆలయ కమిటీ నిర్వాహకులు మాజీ జడ్ పిటిసి మల్లు గారి నర్సాగౌడ్ తో పాటు కమిటీ సభ్యులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు, రథోత్సవంపై ఊరేగుతున్న స్వామిలోరిని గంభీరావుపేట మండల ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులతో పాటు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నరసయ్య, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, హామీద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయి, కొమిరిశెట్టి తిరుపతి, నాయకులు బండారి బాల్ రెడ్డి, గుండాడి రాంరెడ్డి తదితరులు దర్శించుకున్నారు.
