Sunday, September 8, 2024
spot_img
HomeTELANGANAహెల్మెట్, సిట్ బెల్ట్ లేకుండా,మద్యం సేవించి, నిర్లక్ష్యంగా వాహనాలు నడుపవద్దు: సిరిసిల్ల ట్రాఫిక్ ఎస్.ఐ రమేష్.

హెల్మెట్, సిట్ బెల్ట్ లేకుండా,మద్యం సేవించి, నిర్లక్ష్యంగా వాహనాలు నడుపవద్దు: సిరిసిల్ల ట్రాఫిక్ ఎస్.ఐ రమేష్.

రాజన్న సిరిసిల్ల జిల్లా మార్చి 22ఇంక్విలాబ్ టీవీ ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో ట్రాఫిక్ ఎస్.ఐ రమేష్ వాహనదారులకు, హెల్మెట్ డ్రైవింగ్, రాంగ్ రూట్, ర్యాష్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్దలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్.ఐ రమేష్ మాట్లాడుతూ ప్రజలు రోడ్ భద్రత,ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని, వాహనం నడిపే సమయంలో హెల్మెట్, సిట్ బెల్ట్ తప్పని సరిగా ధరించాలని, ప్రాణం ఎంతో విలువైనది అని మన మీద మన కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటారని మద్యం సేవించి, నిర్లక్ష్యంగా, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ లో, అవగాహనరహిత్యంలో వాహనాలు నడుపుతూ ప్రాణాల మీద తెచ్చుకోవద్దని అన్నారు. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైన్సెన్స్ కలిగి ఉండాలని, మైనర్ డ్రైవింగ్ చేయడం నేరం అని మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వరాదు అని తెలిపారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments