రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని గాంధీ నగర్ లో ఓ యువకుడు కుటుంబ కలహాలతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం 11:30 గంటల సమయంలో స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన కొండ లక్ష్మీరాజం గత కొద్ది రోజుల నుండి హోటల్ నడుపుతూ జీవితం కొనసాగిస్తున్నాడని తెలిపారు. కొద్ది రోజులుగా కుటుంబ కలహాలతో సతమతమవుతున్నాడని, జీవితం మీద విరక్తి చెంది తన హోటల్లోనే ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని వెల్లడించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందివ్వగానే స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య వైశాలి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.