రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో హనుమంతరావు మనవరాలు, వెలిచాల రాజేందర్ రావు చెల్లెలు రోహిణి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మద్దతుగా ఎల్లారెడ్డిపేటలో ప్రచారం చేయడానికి వచ్చారు, ఈ సందర్భంగా రోహిణి జాతీయ ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ ఉపాధి కూలీలకు 400 రూపాయలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని పంద్రాగస్టు వరకు రైతుల రుణాలన్నీ మాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అన్నారు, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా మోసం చేసిందో చెప్తూ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తా అని చెప్పి అప్పుల కుంపటిలో ముంచిన ఘనత కెసిఆర్ కు దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచల రాజేందర్ రావును గెలిపించాలని కోరారు, మరియు ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మటి నరసయ్య, మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,జిల్లా కార్యదర్శి పందిరిల్ల లింగం గౌడ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బి పేట రాజ్ కుమార్,వంగ గిరిధర్ రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు ఆకుల లత, ఎల్లారెడ్డిపేట పట్టణ మహిళా అధ్యక్షురాలు బుర్కా జ్యోతి,గుండాడి రాంరెడ్డి, రఫిక్ శ్రీపాల్ రెడ్డి, సాయి రెడ్డి, రవీందర్ రెడ్డి, సంతోష్ గౌడ్, కార్తీక్, శ్రీనివాస్ యాదవ్, ఇలియాస్, కనకరాజు, గోపాల్, తిరుపతి గౌడ్. రామ్ చందర్, పాల్గొన్నారు,