న్యూఢిల్లీ : దేశంలో రెండో అతి పెద్ద టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరిస్తోంది. 5జీ సేవల విస్తరణపై ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కూడా భారీగా విస్తరించనుంది. ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరం రూ.27,000 కోట్ల నుంచి రూ.28,000 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు పేరు వెల్లడించేందుకు ఇష్టపడని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. పెట్టుబడిలో ఎక్కువ భాగం మొబైల్ టవర్లు, ఫైబర్, బ్రాడ్‌బాండ్, ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ డేటా కేంద్రాల ఏర్పాటు కోసం ఖర్చు చేయనున్నట్టు ఆయన చెప్పారు. సాధారణంగా నెట్‌వర్క్ విస్తరణ కోసం ఎయిర్‌టెల్ ఏటా రూ.24,000 కోట్ల నుంచి రూ.25,000 కోట్ల వరకు ఖర్చు చేస్తుంది. 5జీ సేవల నేపథ్యంలో పెట్టుబడులు మరింత పెంచాల్సి వస్తోందని ఆయన అన్నారు.
ఛార్జీల పెంపు తప్పదు
టెలికం ఛార్జీల మరింత పెంచక తప్పదని కూడా ఆ అధికారి చెప్పారు. అయితే ఈ పెంపు ఎంత అనేది మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందన్నారు. ఒడిసా, హర్యానా సర్కిల్స్‌లో ఎయిర్‌టెల్ ఇప్పటికే 28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ కనీస టారి్‌ఫను రూ.99 నుంచి రూ.155 కు పెంచింది. మిగతా సర్కిల్స్‌లోనూ రూ.99 ప్లాన్ రీచార్జి ఆపేసింది. టారి ఫ్‌లు పెంచినా ఆదరణ బాగానే ఉన్నందున ఈ పెంపును మిగతా సర్కిల్స్‌కు విస్తరిండంపై ఆరు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని కంపెనీ వర్గాలు చెప్పాయి. ఒక్కో ఖాతాదారుడి నుంచి లబించే సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) రూ.300కు చేరే వరకు ఈ పెంపు కొనసాగుతుందని మార్కెట్ వర్గాల అంచనా. ఖాతాదారులకు బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్‌తో పాటు సమగ్ర టెలికం సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు ఎయిర్‌టెల్ అధికార వర్గాలు చెప్పాయి. దీని వల్ల ఒక్కో ఖాతాదారుడి నుంచి లభించే ఏఆర్‌పీయూ ప్రస్తుత స్థాయి నుంచి నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపాయి. కార్పొరేట్ సేవలపైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు వెల్లడించాయి.
5జీకి ప్రీమియం ధరలుండవు
కొత్తగా ప్రారంభించిన 5జీ సేవలకు ప్రత్యేక ప్రీమియం ధర వసూలు చేసే యోచన లేదని కంపెనీ వర్గాలు చెప్పాయి. ఇతర దేశాల్లో ఎక్కడా ఇలాంటి ప్రయత్నాలు ఫలించలేదన్నారు. ఎయిర్‌టెల్ ప్రస్తుతం 4జీ టారి్‌ఫతోనే 5జీ సేవలు అందిస్తోంది. 4జీ-5జీ సేవల టారి్‌ఫల్లో తేడా లేకపోవడంతో మరింత మంది 4జీ వినియోగదారులు, 5జీ సేవలకు మారతారని భావిస్తున్నారు.