ఎల్లారెడ్డిపేటకు తప్పిపోయి వచ్చిన కొక్కుల నర్సయ్య (83) అనే వృద్ధుడిని ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ కు బస్ స్టాండ్ ప్రాంత వాసులు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన ఒగ్గు బాలరాజు యాదవ్ డే కేర్ సెంటర్ ఇంచార్జీ మమత కు సమాచారం అందించారు. వెంటనే వృద్ధుడిని డే కేర్ సెంటర్ లో చేర్పించడం జరిగింది. వృద్ధుడిని తన కుటుంబ వివరాలు అడిగితే ఓగులాపూర్ నివాసుడనని సమాధానం చెబుతున్నారు. వృద్ధుడికి చెవులు సరిగా వినబడడం లేదు. ఒగ్గు బాలరాజు యాదవ్ వెంట బిజెపి నాయకులు పారిపెల్లి సంజీవ రెడ్డి, సద్ది జ్యోతి,సద్ది నాగరాణి ఉన్నారు. డే కేర్ సెంటర్ లో చేర్పించడానికి సహకరించిన డే కేర్ సెంటర్ ఇంచార్జీ మమత కు ఒగ్గు బాలరాజు యాదవ్, సంజీవ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. వృద్ధుడి సమాచారం తెలిసిన వారు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం చెరవేయాలని లేదా సమాచారం తెలిసిన వారు ఒగ్గు బాలరాజు యాదవ్ సెల్ నంబర్ కు పోన్ చేయాలని 9059519691 కోరారు.