రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన నైలకంటి సతీష్ (37) కు రాచర్ల కాలేజీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్లారెడ్డిపేట – గొల్లపల్లి ప్రధాన రహదారిపై వెళుతున్న రెండు ద్విచక్ర వాహనాలు ముందుగా వెళుతున్న బైకు (TS02EA 8579) రాచర్ల కాలేజీలోనికి వెళ్లేటప్పుడు వెనకనుంచి వెళ్తున్న నైలకంటి సతీష్ బైకు ( పల్సర్ బైక్ TS23 G 2370) అతివేగంగా ముందు ఉన్న బైకును ఢీకొట్టగా హెల్మెట్ లేనందున నైలకంటి సతీష్ కు తలకు తీవ్ర గాయాలయ్యాయి, ముందు వెళ్తున్న బైక్ వాళ్ళకు స్వల్ప గాయాలయ్యాయి, అటుగా వెళుతున్న బొప్పాపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొండ రమేష్ 108 కు ఫోన్ చేసి స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు, తన జేబులో ఉన్న ఆధార్ కార్డు సహాయంతో దుమాల గ్రామానికి చెందిన వ్యక్తి అని తెలుసుకొని దుమాల మాజీ సర్పంచ్ కి ఇ విషయాన్ని కొండ రమేష్ తెలియజేసి తన బంధువులకు తెలపమన్నారు