రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన జల్లి సత్యం అనే వ్వక్తికీ ఈరోజు సాయంత్రం ఎల్లారెడ్డి పేట బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం బైపాస్ నుండి వస్తున్న జల్లిసత్యం ముందుగా వెళుతున్న కారుకు ఢీకొనగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అక్కడ ఉన్న ఓ ప్రవేటు హాస్పిటల్ కు తరలించారు. మృతునికి ఒక కూతురు కుమారుడు ఉన్నారు ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు