Tuesday, January 21, 2025
spot_img
HomeANDHRA PRADESHటిడిపి సభ్యత్వం నమోదు వేగవంతం చేయండి: కొప్పిశెట్టి వెంకటేష్

టిడిపి సభ్యత్వం నమోదు వేగవంతం చేయండి: కొప్పిశెట్టి వెంకటేష్

అనకాపల్లి జిల్లా నక్కపల్లి గ్రామంలో టిడిపి టౌన్ ప్రెసిడెంట్ అడ్డూరి లోవరాజు ఆధ్వర్యంలో జరిగిన సభ్యత్వం నమోదు కార్యక్రమంలో నక్కపల్లి మండల టిడిపి అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా కొప్పిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ టీడీపీ సభ్యత్వం పొందండం ద్వారా ప్రమాదవాశత్తు ఏమైనా జరిగితే 5 లక్షల ఇన్సూరెన్స్ తో పాటు 10 వేల రూపాయలు మట్టి ఖర్చులు నిమిత్తం టీడీపీ కార్యకర్తలకి ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వం భోరోసా కల్పిస్తుందని తెలియచేశారు. 1లక్ష రూపాయల చందాతో శాశ్వత సభ్యత్వం పొందవచ్చునని టిడిపి నాయకులకు, కార్యకర్తలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొప్పిశెట్టి వీరబాబు, దేవరపు లోవరాజు, అల్లాడ తాతారావు, కొల్నాటి నాగు, కోన రమణ, బంగారి అప్పారావు, పలువురు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments