Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAఏసీబీ కి చిక్కిన ఎల్లారెడ్డిపేట మండల సర్వేయర్

ఏసీబీ కి చిక్కిన ఎల్లారెడ్డిపేట మండల సర్వేయర్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సర్వేయర్ నాగరాజును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు జక్కాపురం మల్లేశం తన వ్యవసాయ భూమి కొలతల పంచానామా ధ్రువీకరణ పత్రం కోసం సర్వేయర్ నాగరాజును కలవగా రైతు జక్కాపురం మల్లేశం నుంచి లక్ష రూపాయలను లంచం అడిగిన సర్వేయర్. ఇంతకు మునుపే సర్వేయర్ కు రైతు మల్లేశం 22 వేల రూపాయలు ఇచ్చాడు మళ్లీ 15 వేల రూపాయలు కావాలని సిరిసిల్లలోని చందంపేట రైతు వేదిక వద్దకు వచ్చి ఇవ్వాలని చెప్పగా సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సర్వేయర్ చెప్పిన ప్రాంతానికి చేరుకొని లంచం డబ్బులు ఇస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకుని ఎల్లారెడ్డిపేట తాసిల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments