అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు గ్రామంలో క్లస్టర్ ఇంచార్జి గింజాల లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ క్లస్టర్ మీటింగ్ కి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొప్పిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సభ్యత్వం ముమ్మరంగా నమోదు చెయ్యాలని పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకి సభ్యత్వం ద్వారా న్యాయం జరగాలని ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షల రూపాయలు, మట్టి ఖర్చులకు పదివేల రూపాయలు అందిస్తారని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 2 సంవత్సరాల వ్యవధికి 100 రూపాయల టిడిపి సభ్యత్వం పొందడం ద్వారా కార్యకర్తలకు మేలు చేకూరుతుందని వెంకటేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో అయినంపూడి అప్పలరాజు, పల్లా రాంబాబు, కొండ్రు కనకారావు, అల్లూరి సురేష్ రాజు, అప్పలరాజు, గోవిందు, శంకర్రావు, కాళ్ళ శ్రీనివాసరావు, పిక్కి గంగరాజు, పిక్కి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు
టిడిపి సభ్యత్వం పొందడం ద్వారా కార్యకర్తకి భీమా భరోసా: కొప్పిశెట్టి వెంకటేష్
RELATED ARTICLES