రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండల ఎస్సై ఎన్ రమాకాంత్ విజ్ఞాన్ హైస్కూల్ లో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని, తాగి వాహనాలు నడపవద్దని, మైనర్ డ్రైవింగ్ చేయరాదని, అతివేగంగా అజాగ్రత్తగా నడపవద్దని, త్రిబుల్ రైడింగ్ చేయవద్దని, మొదలైనవి స్కూల్ విద్యార్థులకు ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ రమాకాంత్ అవగాహన కల్పించారు