Wednesday, September 16, 2026
spot_img
HomeTELANGANAరసూల్ పుర జామామజీద్ ప్రాంతంలోని ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ తోఫా

రసూల్ పుర జామామజీద్ ప్రాంతంలోని ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ తోఫా

రంజాన్ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న రంజాన్ తోఫాను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ శనివారం రసూల్ పుర జామా మజీద్ ప్రాంతంలోని ముస్లిం సోదర సోదరీమణులకు స్ధానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లిం పెద్దలుతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ ఈ పధకం పేద మధ్యతరగతి ముస్లిం కుటుంబాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, ప్రభుత్వం మంచి ఉద్దేశంతో అమలు చేస్తున్న ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పేద ప్రజల సంతోషమే ప్రభుత్వ ధ్యేయమని, అందరూ ఆనందంగా రంజాన్ పండుగను జరుపుకోవాలని ముస్లిం సోదర సోదరీమణులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేష్, రఫిక్, గఫార్, అయూబ్, మజీబ్, ఆంజనేయులు, యూసఫ్ భాను, మల్లేష్, బాలరాజు, స్వాతి, జహంగీర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments